ఓ తల్లికి గ్రూప్ 2 పరీక్ష.. పాపాను ఎత్తుకొని ఆడించిన హోంగార్డ్
తెలంగాణ కెరటం రాజన్న సిరిసిల్ల జిల్లా డిసెంబర్
రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు గ్రూప్ 2 పరీక్షలు కొనసాగుతుండగా సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని దార్మిక డిగ్రీ కళాశాలలో గ్రూప్ 2 పరీక్ష రాయడానికి ఒక మహిళ అభ్యర్థి తన రెండు నెలల పాపతో వచ్చారు.తల్లి పరీక్ష రాయడానికి పరీక్ష కేంద్రంలోనికి వెళ్లడంతో నానమ్మ దగ్గర ఉన్న పాప ఏడవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న హోం గార్డ్ షహనాజ్ గమనించి పాపని ఎత్తుకొని జోలాలీ జో ఊరుకో పాపాయి.. జోల పాడుతా బజ్జో నా తల్లి అంటూ పాపను అల్లారి ముద్దుగా ఆడించింది.ఈ దృశ్యాన్ని ఓ కెమెరా లో చిత్రీకరించడం తో సోషల్ మీడియా లో చూసిన ప్రతి ఒక్కరు
హోం గార్డ్ అంటే పోలీస్ మాత్రమే కాదు – పోలీస్ రూపం లో మరో మాతృ మూర్తి అంటూ
శబాష్ షహనాజ్ అని అభినందనలు తెలిపారు