---Advertisement---

లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

---Advertisement---

లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

–బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి డిమాండ్

తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి, డిసెంబర

బెజ్జంకి మండల కేంద్రంలో మంగళవారం రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పార్టీ మండలాధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, లగచర్ల రైతులపై కాంగ్రేస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వారి పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్ళలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేయడం అమానుష చర్య అని, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అణిచివేత విధానాలను నిరసిస్తూ లగచర్ల రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించాలని, ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు వినతి పత్రం ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, బండి రమేష్, దీటి బాలనర్సు, చింతలపల్లి సంజీవరెడ్డి, జెల్ల అయిలయ్య, నలువాల స్వామి, కర్రావుల మల్లేశం, ముక్కిస తిరుపతి రెడ్డి, హన్మాండ్ల లక్ష్మారెడ్డి, ఎలుక దేవయ్య, ఏల శేఖర్ బాబు, వంగల నరేష్, తిప్పారపు మహేష్, బిగుళ్ల దుర్గ సుదర్శన్, గణపురం తిరుపతి, కల్లూరి రవి, తాడిచెట్టు భూమయ్య, సంగ నరేష్, మంకాల రాజు, కిష్టయ్య, శ్రీనివాస్, నవీన్, రాజు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment