---Advertisement---

రిపోర్టర్ పై దూర్భాషలాడిన డిఎస్పి పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి

---Advertisement---

రిపోర్టర్ పై దూర్భాషలాడిన డిఎస్పి పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి

ఓ రిపోర్టర్ పై పరుష పదజాలం వాడిన కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వర్ రావుపై జిల్లా అడిషనల్ ఎస్పీకి TSJU, NUJ (I) సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. సదాశివనగర్ మండల రిపోర్టర్ గా పనిచేస్తున్న మొహమ్మద్ రఫిక్ ఓ కేసు విషయంలో కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్ రావు దగ్గరికి వెళ్లాడు. తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో నువ్వు ఎవరైతే నాకేంటి రా.. అంటూ ఇతర అసభ్య పదజాలంతో దూషించారు. ఒక జర్నలిస్టు పట్ల డిఎస్పీ తీరుపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొక్కల వేణు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇలియాస్, కార్యదర్శి మధు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ సాయిలు, శ్రావణ్, రఫిక్, అంజల్ రెడ్డి, నర్సాగౌడ్, మహేష్ గౌడ్, బాలాజీ, రాము, వినోద్, శ్రవణ్, రాజ్ కుమార్, ఆనంద్, భాస్కర్, తదితర జర్నలిస్టులు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment