ఇథానాల్ ఫ్యాక్టరీలను వెంటనే రద్దు చేయాలి
–చాడ వెంకట్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యలు
తెలంగాణ కెరటం బెజ్జంకి బెజ్జంకి ప్రతినిధి డిసెంబర్ 19 :
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కౌన్సిల్ సమావేశం బెజ్జంకి మండల కేంద్రంలో ప్రైవేట్ కాంప్లెక్స్ భవనంలో సిపిఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ తో కలిసి పాల్గొన్నారు. సమసమాజ స్థాపన కోసం అణగారిన వర్గాలకు అండగా సీపీఐ ఉంటుందని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాలనే సంకల్పంతో దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా మార్క్సిజం సిద్ధాంత పునాదులపై భారత కమ్యునిస్టు పార్టీ ఏర్పడిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వామపక్ష కమ్యునిస్టు భావాలు కలిగిన దేశాల్లో ఆదరణ పెరుగుతుందని, సీపీఐ పార్టీని విస్తృత పరచడానికి మండల వ్యాప్తంగా గ్రామాల్లో సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలన్నారు. పార్టీని, ప్రజా సంఘాలను బలోపేతం చేసుకునే దిశగా సమావేశాలు నిర్వహించాలన్నారు. అనంతరం తిమ్మాయిపల్లి, గుగ్గిళ్ల, శంకర్ నగర్, నర్సింహులపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న ఇథానాల్ ఫ్యాక్టరీ వద్దకు వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. ఇథానాల్ ఫ్యాక్టరీ వల్ల జనాలకు నష్టం వాటిల్లుతుందని, వెంటనే రద్దు పరచాలని, లేని పక్షంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి, సిపిఐ అక్కన్నపేట మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంగెం మధు, జేరిపోతుల జనార్ధన్, డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు రామగల్ల నరేష్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్, శ్రవణ్, సతీష్, లక్ష్మణ్, శివకృష్ణ, చిట్టి కనుకయ్య, రవి, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.