ఏడాదిలో సీఎం రేవంత్ మార్క్ పాలన
సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాదుల పవన్ కుమార్
తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా ప్రతినిధి
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రగతి బాటలో ప్రయాణిస్తుందని, ఆరు గ్యారంటీ అమల్లో సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనను చూపించారని సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాదుల పవన్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి అడుగుపెట్టిన నాటి నుంచి సీఎం అయ్యే వరకూ విశ్రమించకుండా పార్టీ కోసం పని చేశారనీ, ముఖ్యమంత్రి అయిన తరువాత తనదైన మార్క్ పాలనతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఒకే విడతలో రూ 2 లక్షల వరకు రైతు రుణ మాఫీ చేసి కొత్త రికార్డు నెలకొల్పారనీ, అదే విధంగా దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ సమయంలో అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత రేవంత్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మూసి, రివర్ ఫ్రంట్, ఫోర్త్ సిటి, రీజినల్ రింగ్ రోడ్ వంటి పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారనీ, మూసి ప్రక్షాళన లక్ష్యంగా చేపట్టిన మూసి రివర్ ఫ్రెండ్ ప్రాజెక్ట్ మొత్తం హైదరాబాద్ నగరానికి కొత్త కళ తీసుకొని వస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలో రాజీవ్ ఆరోగ్య శ్రీ , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, వ్యవసాయానికి ఉచిత కరెంటు వంటి హామీలను నెరవేర్చారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుందని పవన్ కుమార్ పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేరుతో వేరు వేరుగా గురుకులాలు పాఠశాలలు ఉన్నాయనీ, వాటిని ఓకే గొడుగు కిందకు తీసుకురావాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట ప్రతి నియోజకవర్గంలో ఒకటి నిర్మించాలని సీఎం రేవంత్ యోచిస్తున్నారని తెలిపారు.