పునరుత్పాతక ఇంధన వనరుల అనే అంశంపై విద్యార్థినిలకు వ్యాచరచన పోటీలు నిర్వహణ కలెక్టర్.
మొదటి రోజు విజయవంతంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు విద్యా దినోత్సవం.
*ధ్యాన్ చంద్ చౌరస్తా*తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల కళాశాల మరియు పాఠశాలలో ప్రజా పాలన
విద్యా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రపాల్.
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 1:
ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అనే అంశంపై నిర్వహించిన వ్యాచరచన పోటీలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
ఆదివారం. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు మొదటి రోజులో భాగంగా ధ్యాన్ చంద్ చౌరస్తా*తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల కళాశాల మరియు పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నీలకంఠం, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి, సంబంధిత ఉపాధ్యాయులతో కలిసి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు విద్యా దినోత్సవం 21 మండలాల్లో పునరుత్పాదక ఇందన వనరులు అనే అంశంపై విద్యార్థినులకు వ్యాచరచన నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రధమ ద్వితీయ మరియు తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు మెమొంటో,ప్రశంసా పత్రాలతో సత్కరించడం జరిగిందన్నారు. విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచన శక్తి అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ లక్ష్యమని కలెక్టర్ అభివర్ణించారు.ప్రజా ప్రభుత్వంలో విద్యా శాఖకు సంవత్సర కాలంలో చేసిన ప్రభుత్వ చర్యలను తెలిపి వాటినిసద్వినియోగపరచుకోవాలని తెలిపారు. పాఠశాలలకు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పన, ఉచిత విద్యుత్, ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు, పండిట్స్ పీఈటీలు అప్ గ్రేడేషన్, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా జిల్లాలో 562 పాఠశాలల్లో 20 కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక వసతులు మెరుగు పరచడం జరిగిందని చెప్పారు,మండల విద్యాశాఖ అధికారి నియామకం గతంలో ముగ్గురు మాత్రమే ఉన్న మండల విద్యాశాఖ అధికారులు ఇప్పుడు ప్రతి మండలానికి ఒకరు చొప్పున 21 మండలాల్లో వీరిని నియమించడం జరిగిందన్నారు, ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు నియామకాల్లో భాగంగా, 617 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, 1681 మంది ఉపాధ్యాయులకు బదిలీలు జరగగా డీఎస్సీ -2024 ద్వారా 270 మంది కొత్త ఉపాధ్యాయులు నియామకాలు జరిగాయన్నారు.
ఉచిత ఏకరూప దుస్తులు 78,288 మంది విద్యార్థులకు రెండు జతలు ఉచిత యాక రూపు దుస్తులు పంపిణీ చేశామన్నారు.ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ పంపిణీలో భాగంగా 8 లక్షల 2928 మంది విద్యార్థులకు 6,61,355 ఉచిత పాఠ్యపుస్తకాలు,1,29,125 ఉచిత నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది అన్నారు, పాఠశాల నిర్వహణ గ్రాంట్ లో భాగంగా 1,51,98 వేల రూపాయలు మూడు నెలలకు గ్రాండ్ రూపంలో మంజూరు చేశారని చెప్పారు.
డైట్ మరియు కాస్మెటిక్ చార్జీలు పెంపుదల లో భాగంగా డైట్ చార్జీలు గతంలో ఉన్న దానికంటే 40% అధికంగా పెంచడం జరిగింది అన్నారు, కాస్మెటిక్స్ చార్జీలు గతంలో కంటే 250 శాతం పెంచడం జరిగింది అన్నారు.
.