---Advertisement---

అడవి సత్యారం చెరువు ధ్వంసం,

---Advertisement---

అడవి సత్యారం చెరువు ధ్వంసం,

ముదిరాజుల అస్తిత్వం పై దాడి చేసిన రెడ్డిలు,

అన్ని చెరువులో జలకల ఈ చెరువు మాత్రం వెలవెల,

అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం,

నారాయణపేట జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు వాకిటి శ్రీనివాస్,

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,


నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలం అడవి సత్కారం గ్రామంలో ఉన్న చెరువు కొంతమంది రెడ్డిలు ఆ చెరువు లోపల ఉన్న భూమిని ఆక్రమించాలనే వక్ర బుద్ధితో కొంతమందిని పావులుగా వాడుకొని ముదిరాజుల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు, ఆ చెరువుకు

ఉన్నటువంటి తూమును పూర్తిగా ధ్వంసం చేసి జెసిబి సాయంతో చెరువు కట్టను పూర్తిగా ధ్వంసం చేశారు, అదేవిధంగా చెరువులో నిలిచే నీటిని పూర్తిగా బయటకు వెళ్లే విధంగా పెద్ద ఎత్తున గోతి తీసి మొత్తం నీరును వాగు కు వెళ్లే విధంగా గోతితవ్వారు, ఇంత జరిగినా కూడా ఆ గ్రామంలో ఉండే కొంతమంది రాజకీయ నాయకులు వారికి వత్తాసు పలుకుతూ ముదిరాజులను అనుగతొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆ గ్రామంలో ఉన్న కొంతమంది మీడియాకు సమాచారం ఇచ్చారు, ఇట్టి విషయమై ముదిరాజ్ సంఘం నారాయణపేట జిల్లా అధ్యక్షులు వాకిటి శ్రీనివాస్ గత కొన్ని నెలల క్రితమే మాగనూరు తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు, అనంతరం తాసిల్దార్ స్థానిక ఆరైను రెవెన్యూ అధికారులను అడవి సత్యారం చెరువు పై పూర్తి విచారణ జరిపి తనకు రిపోర్ట్ ఇవ్వాలని మండల రెవెన్యూ అధికారిని గ్రామానికి పంపారు, వారు పూర్తిగా గ్రామానికి వెళ్లి చెరువు పై ఉన్న పూర్తి వివరాలను అక్కడ అక్రమాలకు పాల్పడిన వారి వివరాలను తాసిల్దార్ కు విన్నవించారు, తాసిల్దార్ ఇరిగేషన్ శాఖ అధికారులకు వివరాలు అందించారు, అయినను ఇరిగేషన్ శాఖ అధికారులు సదరు రెడ్డిలతో కుమ్మక్కై ముదిరాజులను చెరువును ధ్వంసం చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆరోపించారు, వెంటనే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని లేదంటే ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు,

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment