కాంగ్రెస్ ఇంచార్జిని కలిసిన యూత్ కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో , డిసెంబరు నర్సాపూర్ న్యూస్ : కాంగ్రెస్ నర్సాపూర్ నియోజకవర్గ పార్టీ
ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డిని ఇండియన్ యూత్కాంగ్రెస్ నాయకులు హైద్రాబాద్లో కలి శారు. ఈమేరకు కొత్తగా ఎన్నికకాబడిన ఇండియన్ యూత్కాంగ్రెస్ డిస్ట్రిక్ట్, అసెంబ్లీ, మండలనాయకులు మర్యాదపూర్వకంగా నర్సాపూర్ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డిని కలవడం జరిగింది. ఈసందర్భంగా ఆయన యూత్కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ యూత్కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు రియాజ్ అలీ, జిల్లా ప్రధానకార్యదర్శి సయ్యద్ అల్తాఫ్, నర్సాపూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు అరిగే సాయికుమార్, చక్రవర్తిగౌడ్, ప్రధానకార్యదర్శులు షేక్సోఫి, కృష్ణరెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ వివిధమండలాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.