---Advertisement---

ఆవగాహనతోనే హెచ్ఐవి దూరం

---Advertisement---

కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి 

వరల్డ్ ఎయిడ్స్ డే 2024 సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి తదనంతరం కలెక్టరేట్ లో గల కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని అప్పుడే మనము ఈ వ్యాధిని దూరం చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఒకప్పుడు ఈ వ్యాధి అంటే చాలామంది భయపడే వారిని అలాగే ఆత్మహత్యలు కూడా చేసుకునే వారిని కానీ ప్రస్తుతం ఆధునిక చికిత్స ద్వారా హెచ్ఐవి సోకిన వారికి క్రమంగా మందులు వాడితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరిలాగే జీవించే అవకాశం ఉందన్నారు.కావున ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉంటే మనము రాబోయే రోజుల్లో హెచ్ఐవి నిర్మూలించే అవకాశం ఉందని తెలియజేశారు.

వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా జిల్లా ఎయిడ్స్ నివారణ మరి నియంత్రణ సంస్థ వివిధ కళాశాల మరియు పాఠశాలలో వ్యాసరచన పోటీలు, పోస్టర్లు తయారీ అలాగే రంగోలి పోటీల నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే హెచ్ఐవి నిర్మూలన కోసం పనిచేసే ఆరోగ్య సిబ్బందిని మరియు స్వచ్ఛంద సంస్థల సిబ్బందిని ప్రశంస పత్రాలతో తో సత్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డా. రాధిక,ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ డా
ఫరీద ,ఏ ఆర్ టి నోడలు ఆఫీసర్ డాక్టర్ శరత్,ఏ ఆర్ టి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్నేహ,డిపిఓ పద్మజ, డి పిఎం సుధాకర్, జిల్లా ఎయిడ్స్ నివారణ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది,(సేవసంగం,YRG care , WORD, పాజిటివ్ నెట్ వర్క్,సాయి చారిటబుల్ ట్రస్ట్, హెల్పింగ్ హ్యాండ్స్ )మరియు వివిధ కళాశాల విద్యార్థులు ప్రిన్సిపల్స్ (ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ,సౌత్ క్యాంపస్ తెలంగాణ యూనివర్సిటీ , PJR స్ఫూర్తి, ఇది కళాశాల, గంజి స్కూల్ , ప్రభుత్వ పాఠశాల దేవునిపల్లి )పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment