లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలి
కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ ఉన్న కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించి (2023, 2024 అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి ఎసిపి, సిఐలతో ఆరా.
రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి
పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ
తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా క్రైమ్ ప్రతినిధి
పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ* 2023 సంవత్సరంలో పెండింగ్ ఉన్న కేసులలో అన్ని కోణాలుల్లో పరిశోధన చేసి కేసులు ఫైనల్ చేయాలని సూచించారు.
గర్ల్స్, ఉమెన్ మిస్సింగ్ కేసులలో దరఖాస్తు రాగానే వెంటనే కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించి, వెంటనే ట్రేస్ ఔట్ చేయాలని సూచించారు. మిస్సింగ్ కేసులలో ఎలాంటి అలసత్వం వహించవద్దు తెలిపారు
సి ఈ ఐ ఆర్ లో ట్రేస్ అవుట్ అయినా మొబైల్ ఫోన్లను వెంటనే రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగించాలని సూచించారు.
యంఓ అపెండర్స్, సస్పెక్ట్లు, కేడీలు, డిసీలు, రౌడీలు, పై నిఘా ఉంచి వారి యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు.
డయల్ 100 కాల్ రావాలి వెంటనే రెస్పాండ్ అయి సాధ్యమైనంత త్వరగా సంఘటన స్థలానికి వెళ్లి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
నాన్ బేలబుల్ వారెంట్ (ఎన్ బి డబ్ల్యూ ఎస్) సాధ్యమైనంత త్వరగా ఎగ్జిక్యూట్ చేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల గురించి రోడ్ సేఫ్టీ కమిటీ, సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులతో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను సందర్శించి నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీసీటీఎన్ఎస్ లో ఎఫ్ఐఆర్, సిడిఎఫ్, పార్ట్ వన్, పార్ట్ టూ, రిమాండ్ డైరీ, చార్జిషీట్ సీసీ నెంబర్ డాటా ను ఏరోజు కారోజు ఎంట్రీ చేయాలనీ పెండింగ్ ఉన్న దరఖాస్తులను విచారణ చేసి త్వరగా డిస్పోజల్ చేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్లో కేసులలో ఉన్న క్రైమ్ వెహికల్ కోర్టులో కేసు డిస్పోజల్ కాగానే వెంటనే సంబంధిత యజమానికి అందజేయాలని సూచించారు. వాహనాలు అప్పగించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు.
ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీస్ సింగ్ విధులు నిర్వహించాలనీ,
పోలీస్ అధికారులు సిబ్బంది గ్రామాలను సందర్శించినప్పుడు కమ్యూనిటీ పోలీసులో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. డ్రగ్ ఇతర మత్తు పదార్థాలు, సైబర్ నేరాలు, అభయ యాప్, సామాజిక రుక్మతల గురించి కాలేజీలలో స్కూల్లలో విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని
గంజాయి, ఇతర మత్తు పదార్థాలు పేకాట, జూదం, తదితర వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఉక్కు పాదంతో అణిచివేయాలి. మహిళల రక్షణకు పెద్దపీట వేయాలనీ.
ప్రతి అధికారి నిజాయితీగా విధులు నిర్వహించాలి. విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దు, విధి నిర్వహణలో అలసత్వం వహించే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సిద్దిపేట ఏసిపి మధు, గజ్వేల్ ఎసిపి పురుషోత్తం రెడ్డి, హుస్నాబాద్ ఏసీపి సతీష్, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఇన్స్పెక్టర్ కమలాకర్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, రూరల్ సీఐ శ్రీను, దుబ్బాక సీఐ శ్రీనివాస్, తొగుట సీఐ లతీఫ్, గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, మరియు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.