పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన మోర్తాడ్ లక్ష్మీనారాయణ
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 01 : కోరుట్ల పట్టణంలోని 03,వ వార్డు మాదాపూర్ కాలనీలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను స్ధానిక కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మాదాపూర్ కాలనీలో గత కొన్ని రోజులుగా మురికి కాలువలో చెత్త పేరుకుపోవడంతో అలాగే మురికి కాలువను అనుకొని పనికిరాని మొక్కలు చెత్తాచెదారం ఉండడంతో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ లకు తెలియజేయగా మున్సిపల్ సానిటరీ జవాన్, పారిశుద్ధ్య కార్మికులతో మాదాపూర్ కాలనీ శుభ్రపరచినట్లు తెలిపారు. అదేవిధంగా పారిశుద్ధ్య పనులు స్తంభించినప్పుడు కాలనీవాసులు తనకు తెలియజేయాలని కోరారు. అదేవిధంగా మన ఇంటి పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దాని వల్ల ఎలాంటి అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉండదు కాబట్టి మనమందరం మన ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పూల కుండీలలో, టైర్లలో ఇతర పనికి రాని వస్తువులలో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. లేనియెడల దోమలు వృద్ధి చెంది మనుషులను కుట్టినట్టు అయితే అంటు వ్యాధులు ప్రభులే అవకాశం ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సానిటరీ జవాన్ చిట్యాల రమేష్, పారిశుధ్య కార్మికులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.