ప్రయాస-2024 ఫైనల్ రౌండ్ కు దామరకుంట విద్యార్దిని ఎంపిక
–మండల విద్యాధికారి వెంకటరాములు
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి 16,
ప్రయాస 2024 ఫైనల్ రౌండ్ కు దామరకుంట విద్యార్ధిని లింగా వైష్ణవి జాతీయస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్సిఇఆర్సిటి-డిఇఎల్ హెచ్ ఐ వారి ఆధ్వర్యంలో వినూత్నమైన ప్రాజెక్ట్స్ ఎంపిక లో భాగంగా ఆన్లైన్లో నిర్వహించబడుతున్న పోటీల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రయాస-2024 లో ఎన్నికైన ఏకైక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత సిద్దిపేట జిల్లా,మర్కుక్ మండల పరిధిలో గల ధామరకుంట పాఠశాల విద్యార్థిని లింగ వైష్ణవి 9 వ తరగతి వారి యొక్క గైడ్ టీచర్ వై.చిన్న బ్రహ్మయ్య భౌతిక శాస్త్రం అధ్వర్యంలో,ప్రయాస రెండవ దశ(ఫైనల్ రౌండ్) కు ఎన్నిక కావడం పట్ల,జిల్లా విద్యాశాఖాధికారి జిల్లా సైన్స్ అధికారి కల్లేపల్లీ శ్రీనివాస్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రస్తుతం మండల విద్యాధికారి ఏ.వెంకట రాములు పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు,పి.బాల్ రెడ్డి,ఉపాధ్యాయ బృందoను అభినందిస్తూ ఈ చివరి దశలో కూడా విద్యార్థి ఉత్తమ ప్రదర్శన చేసి విజయం సాధించానని ఆశాభావం వ్యక్తం చేశారు.