---Advertisement---

ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

---Advertisement---

ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 01 : ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా డిసెంబర్ 01 నుండి 09 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఆదివారం మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు కోరుట్లలోని అన్ని వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ డిసెంబర్ ఒకటి నుండి తొమ్మిది వరకు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరుగుతుందని, ప్రతి వార్డులో మెయిన్ డ్రైనేజీలు, వార్డులలో ఉన్న మురికి కాలువలు తీయించి ట్రాక్టర్ ద్వారా లిఫ్ట్ చేయించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, మున్సిపల్ జవాన్లు, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment