భక్తుల మన్నతులు దువాల మధ్య ఖందిల్ ప్రవేశం

  • ముత్తవల్లి షేక్ అక్బర్ తో వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్లు
  • ముతవల్లి ఇంటి నుండి బయలుదేరిన కందిల్
  • దర్గా ప్రాంగణంలో భక్తుల కోలాహలం
  • ముస్తాబైన మౌలా మస్తాన్ తాలిమ్ దర్గా ప్రాంగణం
  • వేల మందికి మహా అన్నదానం
  • ముగిసిన దర్గా ఉర్సు మహోత్సవం

ఖమ్మం అర్బన్​, జనవరి 17 (తెలంగాణ కెరటం): ఖమ్మం నడి బొడ్డున వైరా రోడ్డుల గల ప్రాచీన మౌలా మస్తాన్ తాలిమ్ దర్గా ఉర్సు మహోత్సవం, భక్తుల మన్నతులు, దువాల మధ్య గురువారం రాత్రి దర్గా ప్రాంగణంలో ఖందిల్ ప్రవే శించింది. ఘనమైన చరిత్ర గలిగినా దర్గా ఉరుసు మహోత్సవంలో గత సంవత్సరం వలె వేలాదిమంది భక్తులు హాజరై తమ తమ మన్నతులు తమ తమ దువ్వాలతో రాత్రంతా జాగారం చేశారు. కొబ్బరికా యలు, ఉదు బత్తీలు, సాంబ్రాణిల తో  మొక్కులు మొక్కుకుంటూ  ఖందిలు రాకను పురస్కరించుకొని భక్తులు ఎదురెళ్లి ఘనంగా స్వాగతం పలికారు. మహిళా భక్తులు ఎటువంటి అసౌక్యారానికి గురికాకుండా తాత్కాలిక పద్ధతి లో బాత్రూంలను ముతవల్లి షేక్.అక్బర్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2000 మందికి పైగా భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అడుగడుగునా భక్తులు భక్తి పారవశ్యాంతో.. ఉరుసు కార్యక్రమంలో భాగంగా దర్గాలో తలపెట్టిన ప్రతి పనిలో పాల్గొని తరిం చారు. ముధవల్లి షేక్.అక్బర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉరుసు కార్య క్రమం అంగ రంగా వైభవంగా కొనసాగే లా పలు చర్యలు ముందస్తుగా చేపట్టటం విశేషం. ఈ ఉరుసు కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్లు ఫైజోద్దీన్, సలీంలు హాజరై పలు సూచనలు చేశారు. వీరితో పాటు పాండురగాపురం మసీదు కమిటీ మాజీ చైర్మన్ మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఉరుసు సందర్భంగా ముతవల్లి షేక్. అక్బర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ సైతం మంచి బందోబస్తును ఏర్పా టు చేయటంపై కూడా ప్రశంసలు వెలు వెత్తాయి. మౌలా మస్తాన్ తాలిమ్ దర్గా ఉరుసు మహోత్సవం రెండు రోజుల పాటు ఘనంగా జరగటం, అంతే ఘనం గా ముగియటం పై భక్తులు తమ హర్షా న్ని ప్రకటించారు. ముతవల్లి షేక్ అక్బర్ ఇంటి నుండి మెళ తాళాల మధ్య కందిల్ రాక కోసం భక్తులు గంటల పాటు వేచి చూసి, ఖందిల్ ప్రవేశంతో ఉర్సు ప్రాంగణంలో ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఉరుసు మహోత్సవం ముగిసిన కూడా దర్గాకు భక్తులు తరలి వస్తూనే ఉండటం ఓ విశేషం.

Join WhatsApp

Join Now

Leave a Comment