కిచక’ ఉపాధ్యాయుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ‘కీ చక’ ఉపాధ్యాయుడి చర్యలు

విద్యార్థులతో అసభ్య ప్రవర్తన..

దేహ శుద్ధిచేసిన విద్యార్థుల తల్లిదండ్రులు

ఉదాసీనంగా వ్యవహరించిన పాఠశాల హెడ్మాస్టర్

విధుల నుండి తొలగించాలని డిమాండ్

ఇలాంటి ఉదంతాలు ఎన్ని జరిగినా ఉపాధ్యాయుల్లో మార్పు రాదా?

తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో

మాతృదేవోభవ, పితృదేవోభవ ఆచార్యదేవోభవ అనే సంస్కృతి అనుసరిస్తున్న భారతదేశంలో తల్లి తండ్రి తర్వాత గురువుకు ప్రాధాన్యతను ఇచ్చారు. తండ్రితో సమానమైన గురువు, విద్యార్థులు నేర్పి సమాజంలో మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాల్సిన గురువే అసభ్యంగా ప్రవర్తిస్తే లోకం తెలియని ఆ పసి మొగ్గలు ఎంతగా నలిగిపోతారో తెలియంది కాదు. అలాంటి విద్యార్థులు నేర్పే ఓ గురువు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం నర్సాపూర్ జి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిస్తూ శునకానందం పొందుతుండగా విసిగిపోయిన ఆ విద్యార్థిని తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడిని నిలదీసి దేహ శుద్ధి చేసినట్లు సమాచారం. అనంతరం ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆ తల్లిదండ్రులు హెచ్చరించి వెళ్లారు.

కీచక ఉపాధ్యాయుడు

విద్యార్థులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయుడు ప్రతినిత్యం అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, పాఠాలు చెప్పడం తక్కువ.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం వెకిలి చేష్టలు చేయడం, వారి శరీరాలను తాకడం చేస్తూ ఉండేవాడు. గత కొన్ని రోజుల నుండి ఈ తతంగం కొనసాగుతూ ఉండగా విసిగిపోయిన ఆ చిన్నారులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పారు. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని సదరు ఉపాధ్యాయుడిని విచారించగా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసినట్లు వినికిడి. అనంతరం ఇకమీదట ఇలాంటి పనులు చేస్తే సహించేది లేదంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాఠశాల హెడ్మాస్టర్ ఉదాసీనత

సదరు ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయం బయటకు పొక్కడంతో మా ప్రతినిధి సంబంధిత హెడ్మాస్టర్ (ఎంఈఓ) ను చరవానిలో సంప్రదించగా సంఘటన జరిగిన విషయం వాస్తవమని, సదరు ఉపాధ్యాయుడి పై ఉన్నత అధికారులకు సమాచారం అందించామని తెలిపారు. వాస్తవానికి పాఠశాల హెడ్మాస్టర్ పాఠశాలలో ఉపాధ్యాయులకు తరగతులను అప్పజెప్పడం, ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారా లేదా అనే విషయాన్ని తరగతి గదుల వైపు వెళుతూ చూడటం జరగాలి. కానీ సదరు హెడ్మాస్టర్ అవేమీ పట్టించుకోకుండా సరైన నియంత్రణ లేకపోవడంతోనే ఇలాంటివి జరుగుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శలు చేస్తున్నారు.

విధుల నుండి తొలగించాలి:

విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సదరు ఉపాధ్యాయుడిని విధుల నుండి తొలగించడంతోపాటు, ఉదాసీనంగా వ్యవహరించిన హెడ్మాస్టర్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇకమీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు అంటే ఇద్దరి పైన తీవ్రమైన చర్యలు తీసుకోవాలని డీఈఓ ను పలువురు కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment