ఎస్. జె. డబ్ల్యూ. హెచ్. ఆర్. సి ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు
– హాజరైన పులువురు మేధావులు, ప్రముఖులు, ప్రతినిధులు
కింగ్ కోటి : సోషియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ డా. కొప్పుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలను హైదరాబాద్ కింగ్ కోటి లోని తెలంగాణా సారస్వత పరిషత్ లో
తెలంగాణా రాష్ట్ర చైర్మన్ డా. లోయపల్లి నర్సింగ్ రావు, డా. మార్గం విజయ్ పటేల్ సహకారంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ జాతీయ ఎస్సి కమీషన్ మెంబర్ కె. రాములు, తెలంగాణా రాష్ట్ర మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బి. ఎస్. రాములు , ప్రముఖ సైకాలాజిస్ట్ మరియు హిప్నో థెరపిస్ట్ డా. హిప్నో పద్మ కమలాకర్, తెలంగాణా హైకోర్టు న్యాయవాది రమేష్ కడారి హాజరయ్యారు. ఈ కె. రాములు, బి. ఎస్. రాములు మాట్లాడుతూ జాతీయ చైర్మన్ డా. కొప్పుల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం కుల, మతాలకు అతీతంగా అందరూ సమానులే అని భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కేలా చూడాలని చేస్తున్న న్యాయ పోరాటలు చాలా గొప్పవాన్నారు. డా. హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ హక్కుల పరిరక్షణలో భాగంగా కుటుంబాల్లో చిన్న చిన్న విషయాలకు ఘర్షణలు పడుతున్నారని పేర్కొన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటే ఎటువంటి సమస్యలు రావు అన్నారు. కొప్పుల విజయ్ కుమార్ లాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలన్నారు. నేషనల్ బోర్డు నెంబర్ మార్గం విజయ పటేల్, బోర్డు డైరెక్టర్ కొప్పుల రవి బాబు, హైకోర్టు అడ్వకేట్ కడారి రమేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం, అందులోని ఆర్థికల్స్, హక్కులు, బాధ్యతలు గురించి వివరించారు. అనంతరం జాతీయ చైర్మన్ డా. కొప్పుల విజయ్ కుమార్, తెలంగాణా రాష్ట్ర చైర్మన్ డా. లోయపల్లి నర్సింగ్ రావు మాట్లాడుతూ ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానులే అని అన్నారు. సమానత్వం మన హక్కు అని పేర్కొన్నారు. అదేవిదంగా ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉందన్నారు. హత్యలు, ఆత్మ హత్యలు నేరం అని అన్నారు. తమకు హక్కులు, స్వేచ్చ ఉన్నాయని ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఉండడం మీ బాధ్యత అని గుర్తు చేశారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి భారత్ సేవా పురస్కార్ అవార్డ్స్ అందించి, ప్రోత్సాహించారు. ఈ కార్యక్రమంలో సోషియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శి మామిడాల మనోహర్, సౌత్ ఇండియా చైర్మన్ డా. జి హన్మ గౌడ్, సౌత్ ఇండియా వైస్ చైర్మన్ డా. జూపెల్లి తిరుమల రావు, డా. సంపత్ గౌడ్, తెలంగాణా రాష్ట్ర వైస్ చైర్మన్ డా. కస్తూరి లక్ష్మా రెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బి. నవీన్ కుమార్, సెక్రటరీ దత్తద్రి గౌడ్, షేక్ సత్తార్, రాష్ట్ర ఉమెన్ చైర్మన్ పూదరి రాజేశ్వరి, రాష్ట్ర డైరెక్టర్ మాలేపు నారాయణ, రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ మధుకర్, రాష్ట్ర ఆర్టిఐ సెల్ చైర్మన్ కే నారాయణ తో పాటు సుమారు 300 మంది పాల్గొనడం జరిగింది.