---Advertisement---

అభివృద్ధికి. శిలాతోరణం. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు 

---Advertisement---

అభివృద్ధికి. శిలాతోరణం. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

వందేళ్ళ మహాదేవాలయంకు నిధుల వరద.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 12:

 

– కరువున్న సీమలో కరుణామయుని సన్నిదికి 29 కోట్లు

– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఆవిర్భావం తరువాత మెదక్ చర్చికి నిధుల పరుగులు

– 29 కోట్ల 18 లక్షల రూపాయలతో మెదక్ కెతిడ్రల్ చర్చి సుందరీకరణ

– యాత్రికుల సౌకర్యార్థం 24 కోట్ల 50 లక్షల రూపాయలతో వసతి గృహాల నిర్మాణం

– మంచినీటి సరఫరా కోరం 1 కోటి 50 లక్షల రూపాయల మంజూరు

– చర్చి ఆవరణలో ఏసుక్రీస్తు విగ్రహ ఏర్పాటుకు 45 లక్షల రూపాయల మంజూరు

– చర్చి ప్రాంగణంలో సెంట్రల్ లైటింగ్ కు 18 లక్షల 50 వేల రూపాయలు

– చర్చి పరిసరాల్లో సిసి రోడ్లకు 2 కోట్ల 55 లక్షల రూపాయలు

– మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే మైనంపల్లి డాక్టర్. రోహిత్ రావు.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ కెతిడ్రల్ చర్చి 1952 లో కరువున్న సీమలో ఆసియా దేశంలోనే రెండవ చర్చిగా మెదక్ పట్టణంలో నిర్మాణం చేపట్టారు. డిసెంబర్ 25, 2024 నాటికి ఆ మహాదేవాలయం కు వందేళ్ళు పూర్తి కానున్నాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఆవిర్భావం అయినప్పటి నుండి.తెలంగాణ రాష్ర్టం ఆవిర్భావం తరువాత కూడా మెదక్మహాదేవాలయానికి నిధులు వచ్చిన దాఖలాలు లేవు…. కాని గత సంవత్సర కాలంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో చరిత్రలో మొట్టమొదటి సారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ .మైనంపల్లి రోహిత్ రావు విజ్ఞప్తి మేరకు రాష్ర్ట ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి వందేళ్ళ మహాదేవాలయ సన్నిధికి 29 కోట్ల 18 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేసి ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం గొప్ప పరిణామం అని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డాక్టర్.మైనంపల్లి రోహిత్ అన్నారు. గురువారం చిన్నశంకరంపేట, రామాయంపేట, హావేళిఘణాపురం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలపై పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్..మైనంపల్లి రోహిత్ రావు ఒక ప్రకటనలో పేర్కోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతవసంతాలు పూర్తి చేసుకుంటున్న మెదక్ మహాదేవాలయం అభివృద్ధి కోసం రాష్ర్ట కాంగ్రెస్ ప్రభుత్వం 29.18 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జి.ఓ.ఆర్.టి. నెం. 320 ప్రకారం జారీ చేసినట్లు పేర్కోన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంఛిన మెదక్ కెతిడ్రల్ చర్చిలో వివిధ అభివృద్ధి పనులకు నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ విజ్ఞప్తి చేయడంతో స్పందించిన రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 29 కోట్ల 18 లక్షల 50 వేల రూపాయలు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నుండి విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కోన్నారు. కాగా యాత్రికుల సౌకర్యార్థం 24 కోట్ల 50 లక్షల రూపాయలతో వసతి గృహాల నిర్మాణం, మంచినీటి సరఫరా కోరం 1 కోటి 50 లక్షల రూపాయలు, చర్చి ఆవరణలో ఏసుక్రీస్తు విగ్రహ ఏర్పాటుకు 45 లక్షల రూపాయలు,చర్చి ప్రాంగణంలో సెంట్రల్ లైటింగ్ కు 18 లక్షల 50 వేల రూపాయలు, చర్చి పరిసరాల్లో సిసి రోడ్లకు 2 కోట్ల 55 లక్షల రూపాయలు విడుదల అయినట్లు ఎమ్మెల్యే డాక్టర్. మైనంపల్లి రోహిత్ రావు పేర్కోన్నారు. ఏడుపాయల వనదుర్గమ్మ.పోచారం అభయారణ్యం అభివృద్ధిలపై ప్రత్యేక ఫోకస్ తెలంగాణ రాష్ర్టమే కాకుండా కర్ణాటక, మహారాష్ర్టాల నుండి తల్లిలాగా పోల్చుకునే ఏడుపాయల వనదుర్గమ్మ దేవాలయం తో పాటు ప్రకృతి రమణీయతను చాటే పోచారం అభయారణ్యాల అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. వందేళ్ళ మహాదేవాలయానికి ఏ ప్రభుత్వం చేయని విధంగా సంవత్సర కాలం పూర్తి అయిన కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అభివృద్ధి పై చిత్తశుద్దిని చాటుకుందని, అదే విధంగా ప్రత్యేక నిధులతో ఏడుపాయల దేవస్థానం మరియు పోచారం అభయారణ్యాలను అభివృద్ధి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.మెదక్ వందేళ్ళ మహాదేవాలయానికి అభివృద్ధి కొరకు 29 కోట్ల 18 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేసిన రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యాటక శాఖ మాత్యులు జూపల్లి క్రిష్ణారావు, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రివర్యులు కొండా సురేఖ, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment