న్యూ కామన్ డైట్ మెను ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 14:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థులకు పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలకు గాను ఈరోజు బాన్సువాడ మండల పరిధిలోని బోర్లం మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో న్యూ కామన్ డైట్ మెనును ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు,
పాఠశాల మెస్ ను తనిఖీ చేసి కూరగాయలను, పప్పులను, వంట సామగ్రిని పరిశీలించారు.
అనంతరం బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ మరియు గ్రామీణ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.