పురపాలికలో శరవేగంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సర్వే

పురపాలికలో శరవేగంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సర్వే

 

దుబ్బాక:డిసెంబర్21,(తెలంగాణ కెరటం )

దుబ్బాక పురపాలికలో ఇళ్ల స్థలం ఉండి, ఇల్లు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇళ్ల కోసం ఏర్పాటు చేసిన కమిటీ సర్వే అత్యంత పారదర్శకంగా, శరవేగంగా కొనసాగుతుందని దుబ్బాక పురపాలక కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. శనివారం దుబ్బాక పట్టణంలోని 18 వ వార్డులో కొనసాగుతున్న ఇందిరమ్మ ఎల్ల కమిటీ సర్వే ను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి వరకు పురపాలికలోని 20 వార్డుల్లో దాదాపు 45% ఇళ్ల కమిటీ సర్వే పూర్తయిందన్నారు. అనంతరం 18 వ వార్డులో 40 లక్షలతో నిర్మించి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న చిల్డ్రన్స్ పార్క్ను పరిశీలించారు. మరో వారం రోజుల్లో చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించి, చిన్నారులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆయన వెంట సీనియర్ అకౌంటెంట్ అనిల్ కుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ బుస ప్రవీణ్, బిఆర్ఎస్ నాయకుడు గన్నె భూమిరెడ్డి తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment