---Advertisement---

పెయింటింగ్ కార్మికుల పనికి చట్టబద్ధత కల్పించాలి

---Advertisement---

పెయింటింగ్ కార్మికుల పనికి చట్టబద్ధత కల్పించాలి

పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 21 : పెయింటర్స్ కార్మికుల పనికి చట్టబద్ధత కల్పించాలని కోరుట్ల పట్టణ పెయింటర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం కోరుట్ల పట్టణంలోని పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఇతర రాష్ట్రాలైన యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పెయింటర్స్ తెలంగాణ రాష్ట్రంకు వలస వచ్చి ఇక్కడ పెయింటింగ్ పని చేస్తున్నారని, దీనితో తమకు పని దొరకక ఉపాధి కరవు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ చట్ట ప్రకారం పని చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ర్టాలకు చెందిన పెయింటర్లను ఇక్కడి నుంచి పంపించి వేసి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వం ను విన్నవించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు అండ్లపాటీ గంగాధర్, ఉపాధ్యక్షులు బాల్క ప్రేమ్ సాగర్, కోశాధికారి సంగ హరీష్, బాబా పటేల్, వెంకటేష్ , రాజబోస్, మున్నా, కరీం, దత్తాత్రేయ, రఘు, శివ, ఆబిద్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment