హైదరాబాదు తరలిన అంబేద్కర్ మాల సంఘ నాయకులు

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 01 : ఆదివారం హైదరాబాదులో జరిగిన హలో మాల..చలో హైదరాబాద్… మాలల సింహ గర్జనకు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ, మండల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాల సంఘ నాయకులు సుమారు 1,000 మంది బయలుదేరి వెళ్లారు. అంబేద్కర్ సంఘ రాష్ట్ర నాయకులు జెండాను ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు కోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నామన్నారు. మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టేందుకే మనువాద పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. దేశంలో మాలల సత్తాను చూపిస్తామని తెలిపారు. ఈ మాలల సింహగర్జనకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాదిగా మాలలు హాజరై సభను విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బలిజ రాజారెడ్డి, ఉయ్యాల నరసయ్య, రాజనర్సయ్య, ఉయ్యాల శోభన్, బద్ది మురళి, రాజేందర్, రాసమల్ల రాజనర్సయ్య, గోరువంతులు నారాయణ, బొలుమల్ల నరేష్, బద్ది సంజీవ్, గంగారెడ్డి, ఉమ్మడి గంగాధర్, సుమన్, ప్రశాంత్, చంద్రం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment