సూర్యాపేట జిల్లా ఎస్ పి ఆధ్వర్యంలో యోగ , ధ్యాన కార్యక్రమం .
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21 . ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్. ఆదేశాల మేరకు అదనపు ఎస్పి అధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు పోలీసు సిబ్బందితో ధ్యాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన కేంద్ర శిక్షకులు పోలీసు సిబ్బంది ధ్యానం చేయించడం జరిగింది. ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమం నందు 250 మంది సిబ్బంది పాల్గొని ధ్యానం చేశారు. అదనపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం కూడా కలిగి ఉండాలని సిబ్బంది ఒత్తిడిని అధిగమించడానికి వీలైనప్పుడు ధ్యానం యోగా లాంటి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఏ ఆర్ . డి ఎస్ పి నరసింహ చారి, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఆర్ఎస్ఐలు ఎస్సైలు, ఏ ఆర్ సిబ్బంది, ఎస్ బి , డి సి ఆర్ బి , షీ టీమ్స్, సూర్యాపేట పట్టణ పి ఎస్ సూర్యాపేట రూరల్ పి ఎస్ , చివ్వెంలా పిఎస్ పెన్పహాడ్ పిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన కేంద్రం శిక్షకులు పాల్గొన్నారు.