*పండగ పూట తన సొంత గ్రామానికి వచ్చిన యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి*
తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రతినిధి డిసెంబర్ 25.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం ఖాజాపూర్ గ్రామంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా చర్చ్ పై జండా కడుతున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి శోభన్ (19) అనే యువకుడు మరణించాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరిని మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.చర్చ్ పై ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలంటూ గతంలోనే ఫిర్యాదు చేసినా, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు.ఆ గ్రామంలో పండగ వాతావరణం విషాద ఛాయలకు గురైంది.