*పోలీస్ శాఖలో కలకలం*

*పోలీస్ శాఖలో కలకలం*

*శ్రుతి, నిఖిల్‌ మృతదేహాలు లభ్యం*

*ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్పీ సింధూశర్మ*

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 26:

కామారెడ్డి జిల్లా పోలీసుశాఖలో బుధవారం రాత్రి కలకలం రేగింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌, బీబీపేట మహిళా కానిస్టేబుల్‌ శ్రుతి అదృశ్యం కావడం, వారి సెల్‌ఫోన్లు అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు కట్టపై లభ్యం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానించారు. ఈ మేరకు చెరువులో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శ్రుతి, నిఖిల్‌ మృతదేహాలు లభ్యమయ్యాయి.
భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌ కోసం గాలిస్తున్నారు. వారి ఫోన్లు స్విచాఫ్‌ రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా సదాశివనగర్‌ మండలంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి శివారులో ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళ్లారు. చెరువు కట్టపై ఎస్సై సొంత కారుతో పాటు మూడు ఫోన్లు, మూడు జతల చెప్పులు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా ఎస్సై సాయికుమార్‌, కానిస్టేబుల్‌ శ్రుతితో పాటు బీబీపేట పీఏసీఎస్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్‌గా గుర్తించారు.ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానించారు. సమాచారమందుకున్న ఎస్పీ సింధూశర్మ హుటాహుటిన అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన శ్రుతి బీబీపేటలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నది. మెదక్‌ జిల్లాకు చెందిన సాయికుమార్‌ గతంలో బీబీపేట ఎస్సైగా పని చేసి, బదిలీపై భిక్కనూరుకు వచ్చారు. బీబీపేటలో పని చేసిన సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఇద్దరూ కలిసి ఒకేసారి అదృశ్యం కావడం, ఫోన్లు, చెప్పులు ఒకేచోట లభ్యం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావించారు. వీరితో పాటు మరో వ్యక్తి కూడా ఉండడం కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నది.వారితోపాటు నిఖిల్ అనే మరో వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతులకు సంబంధించిన పలు ఆనవాళ్లు చెరువు వద్ద లభించడంతో చనిపోయింది వారేనని పోలీసులు భావిస్తున్నారు. కారుతోపాటు నిఖిల్ చెప్పులు చెరువు వద్ద గుర్తించారు. సుమారు ఐదు గంటలకుపైగా ఎస్ఐ సాయికుమార్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. కాగా, పెద్ద చెరువులోని మృతదేహాలను వెలికి తీసేందుకు బుధవారం అర్ధరాత్రి వరకు పోలీసులు, సహాయక బృందాలు గాలింపు చేపట్టాయి.మహిళా కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. సాయికుమార్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. అయితే, వీరంతా ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనేది ఇప్పటి వరకు తెలియరాలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment