ముగ్గురు హెడ్ కానిస్టేబుల్ కుఏ ఎస్ ఐ లుగా పదోన్నతి.
జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
వెల్లడి.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 26:
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లా కు చెందిన ముగ్గురికి హెడ్ కానిస్టేబుల్ లకు ఏ.ఎస్.ఐ లు గా పదోన్నతి పొందారని అన్నారు. గత కొంత కాలంగా ప్రమోషన్స్ గురించి ఎదురుచూస్తున్న హెడ్ కానిస్టేబుల్స్ కు – ఏ.ఎస్.ఐ లు గా ప్రమోషన్స్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని, ఎన్నో విపత్కర పరిస్థితులలో తమ విధులను సక్రమంగా నిర్వహించి, సుధీర్గ సర్వీసులో ఎలాంటి రిమార్క్ లేకుండా తమ భాధ్యతను నిర్వర్తించి ఏ.ఎస్.ఐ లు గా పదోన్నతి పొందడం సంతోషంగా వుందని, ఏ.ఎస్.ఐ లు గా పదోన్నతి పొందడంతో భాధ్యత మరింత పెరిగిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసారు.
పదోన్నతి పొందినా వారి వివరాలు
ఎండి ఉమర్ తూప్రాన్,
ఎస్.కె.జానీ బాషా తూప్రాన్.
రాచప్ప రేగోడ్ లకు పదోన్నతులు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.