ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 27):
డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని
అచ్చంపేట పట్టణంలో డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టణంలోని రాజీవ్ చౌరస్తా డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూడాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరనీ లోటని,
మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ చేసిన సేవలు దేశం ఎన్నటికి మరిచిపోదని,నిజాయితీ, మంచితనం, సమర్థవంతంగా పని చేయడంలాంటివి మన్మోహన్ సింగ్ ను చూసి నేర్చుకోవాలని ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనుడు మన్మోహన్ సింగ్ ఒక ఆర్థిక వేత్తగా, ఒక అధ్యాపడిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్ గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పదేళ్లపాటు ప్రధానమంత్రిగా వారు దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పూడ్చలేనిదని అన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల చైర్మన్ లు , సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, యువకులు, పాల్గొన్నారు.