మంగళవారం రాత్రి ఫ్లైఓవర్లు బంద్‌.

మంగళవారం రాత్రి ఫ్లైఓవర్లు బంద్‌.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్

న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్లున్నారు. ఈ క్రమంలో నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లను బంద్ చేయాలని పోలీసులు నిర్ణయించారు.డిసెంబర్ 31న రాత్రి 10 గంటల తర్వాత బైకులు, వాణిజ్య వాహనాలకు ఫ్లై ఓవర్లకు అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు. గత ఏడాది అనుభవాల దృష్ట్యా అతివేగంతో దూసుకెళ్లే ప్రమాదం పొంచి ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు.

పోలీసుల ప్రత్యేక దృష్టి

న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేకంగా నిఘా వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణ, డ్రగ్స్ రహిత హైదరాబాద్ లక్ష్యాలను నిర్ధేశించిన నేపథ్యంలో పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు న్యూ ఇయర్ వేడుకలపై ఫోకస్ చేశాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు నగర శివారుల్లో జరిగే పార్టీలపై ప్రత్యేకంగా నిఘా పెట్టనున్నట్టు తెలుస్తోంది.
అలాగే పలు జిల్లాల్లోని ముఖ్య నగరాల్లో, ఫామ్ హౌస్‌లు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, హోటళ్లపై పోలీస్ శాఖ ఓ కన్నేసి ఉంచింది. న్యూ ఇయర్‌ వేడుకలపై సివిల్ పోలీస్‌తో పాటు నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటి పోలీస్ విభాగాలు కూడా అలర్ట్‌ అయ్యాయి. వేడుకల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలకు ప్లాన్‌ చేసుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఇప్పటికే హైదరాబాద్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్ , హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు. బార్లు, పబ్‌ల లైసెన్స్ తనిఖీ చేశారు.

మైనర్లను అనుమతిస్తే కేసులే.

కొత్త ఏడాది వేడుకల్లో మైనర్లను బార్లు, పబ్‌లకు అనుమతిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. డీజేలతో హంగామా చేయవద్ధని, నిషేధానికి సహకరించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సౌండ్‌ పొలుష్యన్‌కు కారణంగా కాకుండా చూసుకోవాలని పబ్ యజమానులకు ఆదేశాలిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment