విద్యార్థులు భయం లేకుండా బాగా చదవాలి
తెలంగాణ కెరటం ప్రతినిధి డిసెంబర్ 30 కొడిమ్యాల
కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బి నారాయణ సోమవారం రోజున అకస్మికంగా తనిఖీ తనిఖీ చేశారు.
ముందుగా లెక్చరర్లతోటి సమావేశం ఏర్పాటు చేసి కళాశాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల హాజరు శాతం పెంచడంతోపాటు వారు వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా ప్రతి లెక్చరర్ కృషి చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో
మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, కళాశాలకు క్రమం తప్పకుండా హాజరై ప్రణాళికతో భయం లేకుండా చదవాలి. వార్షిక పరీక్షలో పాసై తల్లిదండ్రులతో పాటు కళాశాలకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.వేణు, అధ్యాపకులు జైపాల్ రెడ్డి, ప్రమోద్ కుమార్, బాలకృష్ణారెడ్డి, జయశీల, అనిల్ కుమార్, తిరుపతి, సుమన్, భాస్కర్, ప్రవీణ్, దీక్షిత, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.