గుండూరు గ్రామంలో గల పాఠశాలలో విద్యార్థుల యోగక్షేమాలను తెలుసుకున్న మాజీ ఎంపీ రాములు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి డిసెంబర్
నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంటు సభ్యులు పోతుగంటి రాములు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం స్వగ్రామమైన గుండూరు గ్రామం, కల్వకుర్తి మండలంలోని ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల బాగోగులను పాఠశాలలో జరుగుతున్నటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా విద్యార్థుల తో మమేకమై వారి భవిష్యత్తు ఆలోచనలను ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థినులు బస్సు సౌకర్యం పై ఎంపీ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. దానిపై స్పందించి కల్వకుర్తి డిఎంకి తక్షణమే మాట్లాడి బస్ ఏర్పాటును పరిశీలించాల్సిందిగా ఆదేశించారు.