కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కుల గణన కుటుంబ సర్వే పేరిట ప్రజలను మోసం చేసింది.
ఓ బి సి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల శేఖర్ అన్నారు.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన కుటుంబ సర్వే పేరిట రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేసింది కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు ప్రకటించిన పథకాలు ఏమైనా అమలు చేశారా తెలంగాణ రాష్ట్రంలోని కులాల విషయాలు తప్ప వేరే విషయాలు చాలా తెలుసుకున్న ప్రభుత్వం నేటికీ ఏ విధంగా వారికి లాభం చేయాలనుకుంటున్నారు కుటుంబ సర్వే పేరిట ప్రజలను తికమక పెడుతూ సంఘక్షేమ పథకాలను ఎగవేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.తిరిగి ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరుస్తారో వివరించవలసిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అదేవిధంగా మేము సోమవారం రామయంపేట మండలంలో ఓ బి సి రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలకు పోవాలని మా యొక్క పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్ రామాయంపేట మండలం ఓబిసి మోర్చా అధ్యక్షుడు బక్కయ్య గారి యాదగిరి, ఇప్ప రవీందర్ తదితరులు పాల్గొన్నారు.