నాగార్జునసాగర్ బుద్ధ వనంను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.

నాగార్జునసాగర్ బుద్ధ వనంను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్
చిక్కుడు వంశీకృష్ణ.

అచ్చంపేట నియోజకవర్గంను ఆధ్యాత్మిక ,పర్యాటక కేంద్రంగా మారుస్తాం.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి

నాగార్జున సాగర్‎లోని హిల్ కాలనీలో ఉన్న బుద్ధవనంలోని బుద్ధిని పాదాలు, జ్ఞాన మందిరంను మంగళవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సందర్శించారు.నాగార్జునసాగర్ లోని బుధవారం ప్రాజెక్టు గురించి శాఖ టూరిజం శాఖ అధికారులతో కలిసి సందర్శించి ప్రొజెక్టర్ ద్వారా టూరిజం ప్రమోషన్స్ అభివృద్ధి మొదలైన అంశాలపై వివరించారు.బౌద్ధ టూరిజం సర్క్యూట్‎లో తెలంగాణలోని బుద్ధవనంను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జునసాగర్‌లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారని కొనియాడారు. యావత్ భారతదేశంతోపాటు ప్రపంచానికి బౌద్ధ వారసత్వం, సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టూరిజం అధికారులు బుద్ధ వనం ప్రాజెక్టు అధికారులు నాయకులు నాగర్ కర్నూలు జిల్లా నూతన గ్రంథాలయం చైర్మన్ గంగాపురం రాజేందర్, బల్మూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్రెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment