సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
-దుబ్బాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంగర రవి
తెలంగాణ కెరటం దుబ్బాక:జనవరి
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంగర రవి అన్నారు.దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు దుబ్బాక మండలం గంభీర్ పూర్ గ్రామానికి చెందిన కే బాలయ్యకు రూ. 20000, దుంపలపల్లి గ్రామానికి చెందిన హైమావతికి రూ. 50,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రీ రామ్ నరేందర్, ఐరేని సాయితేజ గౌడ్, భూపతి, రాజేష్, జోగురాజు,తదితరులు ఉన్నారు.