ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించండి:
జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ .
… హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగించి ప్రాణాలు కాపాడుకుందాం.
… మద్యం సేవించి వాహనాలు నడపరాదు.
… డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ మాట్లాడరాదు.
తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,
జాతీయ రోడ్డు భద్రత మసోత్సవాలు-2025 లో భాగంగా శనివారం ఉదయం మక్తల్ పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో ఆటో, క్యాబ్, బాస్ డ్రైవర్లకు, వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు మక్తల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ముందుగా రోడ్డు భద్రతా నియమాలకు సంబంధించిన వాల్పోస్టర్ ను ఆర్ డి ఓ రాంచందర్, డిటిఓ మేఘా గాంధీ, పోలీస్ అధికారులు ట్రాన్స్ పోర్ట్ అధికారులతో కలిసి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరంఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారనే ధ్యేయంగా ప్రతి నెల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరుగుతుందని అందులో ప్రతి శాఖ నుండి రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు గురించి చర్చించి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను హాట్స్పాట్ బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి అక్కడ సైన్ బోర్డ్స్ ఏర్పాటు, రోడ్డు మరమ్మత్తులు, స్పీడ్ బ్రేకర్లు, డంబుల్స్ ట్రిప్స్, మలుపుల దగ్గర కంప చెట్ల తొలగింపు తదితర చర్యలు తీసుకుంటున్నామని అయినా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం డ్రైవింగ్ చేసే సమయంలో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం అని అన్నారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత నియమాలు పాటించి క్షేమంగా తమ గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు. నారాయణపేట జిల్లాలో నేషనల్ హైవేలు 167,150 మొత్తం 81 కిలోమీటర్లు ఉండగా, స్టేట్ హైవే 38 కిలోమీటర్లు ఉన్నాయి, లాస్ట్ ఇయర్ 2024లో రోడ్డు ప్రమాదాల వల్ల మొత్తం 106 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈసారి అలా జరగకుండా ఈ సంవత్సరము జనవరి 1 నుంచి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ భద్రత మసోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలు అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకొని వాహనాలను నడపాలని తెలిపారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణాలు ద్విచక్ర వాహనదారులు తొందరగా వెళ్లడానికి రాష్ డ్రైవింగ్ చేయడం జరుగుతుంది, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల చాలా మటుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు . ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా యువత గురవుతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ కింది ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు వాహనదారులు అతివేగంగా ప్రయాణించరాదని, ఎట్టి పరిస్థితులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సెల్ ఫోన్ మాట్లాడరాదని సూచించారు. వాహనాలను ఓవర్ టేక్ చేసే సమయంలో కుడివైపు నుండి చూసుకొని క్రాస్ చేయాలని తెలిపారు. వాహనాలలో పరిమితికి మించి ప్యాసింజర్లను, చిన్నపిల్లలను ఎక్కించుకోరాదని తెలిపారు. రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయరాదని, త్రిబుల్ రైడింగ్ వాహనాలు నడప రాదని, కార్ డ్రైవింగ్ చేసే సమయంలో సీటు బెల్టు తప్పనిసరిగా ఉపయోగించాలని, ముఖ్యంగా వాహనాలకు ఆర్సి, డ్రైవింగ్, లైసెన్స్ ఇన్సూరెన్స్ తగిన పత్రాలు కచ్చితంగా కలిగి ఉండాలని సూచించారు. వాహనదారులు తప్పకుండా రూల్స్ పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించగలుగుతామని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే రోడ్డు ప్రమాదం జరిగి తమ కుటుంబంలో పెద్దదిక్కు కోల్పోయే అవకాశం ఉంటుంది అని తెలిపారు. డ్రైవింగ్ ఒక వ్యక్తిగత అనుభవంగా కాక సామాజిక బాధ్యతగా వాహనం నడిపే వారందరూ గుర్తించాలి, రహదారి భద్రతా నియమాలను సక్రమంగా పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని డ్రైవర్లకు సూచించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించి ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు డ్రైవర్లచేత రోడ్డు భద్రత నియమాలపై ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం డి ఎం హెచ్ ఓ సౌభాగ్య లక్ష్మి ఆధ్వర్యంలో మెడికల్ డిపార్ట్మెంట్నాకు వాహన డ్రైవర్లకు కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాంచందర్, సీఐలు చంద్రశేఖర్, శివశంకర్, రాజేందర్ రెడ్డి, దశ్రు నాయక్, డి టి ఓ మేఘా గాంధీ,ఎస్ఐ లు భాగ్యలక్ష్మి రెడ్డి, అశోక్ బాబు, నవీద్,కృష్ణం రాజు, వెంకటేశ్వర్లు, కుర్మయ్య, రాముడు, రాజు, రాము, రమేష్, ట్రాన్స్పోర్ట్ అధికారులు ప్రవీణ్, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, తది తరులు పాల్గొన్నారు.