*మాజీ ప్రధాని వాజ్ పేయ్ జయంతి వేడుకలు*
తెలంగాణ కెరటం .వేములవాడ. డిసెంబర్ 25.
భారత మాజీ ప్రధాని భారతరత్న భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులలో ముఖ్యులు అయినటువంటి అటల్ బిహారీ వాజ్ పేయ్ శత జయంతి సందర్భంగా, బుధవారం వేములవాడ బిజెపి కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా, రాజన్న సిరిసిల్ల బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ,
విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం అను పరీక్షల ద్వారా భారత అను శక్తిని ప్రపంచానికి చాటిన ధీశాలి ప్రతిపక్షలతో సైతం శభాష్ అనిపించుకున్న మహానేత అనేకమైన విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన మహా నాయకుడు పార్లమెంటు సాక్షిగా వారి అనేక ప్రసంగాల ద్వారా జీవించడం అయిన దేశం కోసమే మరణించడం అయిన దేశం కోసమే అని చాటుకున్న భరతమాత ముద్దుబిడ్డ శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్ సేవలను మననం చేసుకుంటూ నరేంద్ర మోడీ పాలనలో భారత్ వికసిత్ భారత్ లక్ష్యంగా కొనసాగుతుందంటే కారణం ఆనాడు వారు చూపిన మార్గమే వారు చూపిన మార్గంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగడం దాన్లో భాగంగానే ఈరోజు సుపరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలుపుతూ వారి సేవలను మననం చేసుకోవడం జరిగిందని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమం లో బిజెపి పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు ,రూరల్ మాజీ ఎంపీపీ బండ మల్లేశం ,పిన్నింటి హనుమన్లు, అక్క పెళ్లి వివేక్ రెడ్డి ,గుడిసె మనోజ్ ,రేగుల రాజకుమార్ ,నామాల శేఖర్ బిల్ల కృష్ణ, నేరెళ్ల సాయికుమార్,మమిండ్ల లక్ష్మీరాజం ,రేగుల శ్రీకాంత్ జవాజి రాజశేఖర్, సగ్గు రాహుల్ ,అన్నం నరసయ్య నగేష్ ,రమేష్ బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.