నార్కో అనాలసిస్ పరీక్ష,
చేస్తే నిజం బయటపడుతుంది.
లైవ్ డిటెక్టివ్ టెస్ట్ కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావులకు చేయాలి.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి 18:
లైవ్ డిటెక్టివ్ టెస్ట్
కేటీఆర్, హరీష్ రావు, కవిత,
సంతోష్ రావు నా నలుగురికి చేస్తే అన్ని బయటకు వస్తాయి.కేటీఆర్ ఉద్దేశం కూడా ఆ నలుగురితో పాటు నన్ను చేయాలని ఉద్దేశం నాకు చేయాలని ఉద్దేశంమాజీ మంత్రి కేటీఆర్ పై నమోదైన కేసులో తర్వాత ఆయన అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారన టిపిసిసి అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ ఆరోపించారు. కేసులను తప్పుదోవ పట్టించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనవసర వ్యాఖ్యలు చేయడం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న పది సంవత్సరాలు దేశంలో కాకుండా ప్రపంచంలో ఎక్కడ జరగని అవినీతి కల్వకుంట్ల ఫ్యామిలీ చేసిందని ఆరోపించారు. కేవలం 54 కోట్లే కాకుండా వీళ్ళకోట్లు అవినీతి జరిగిందని అవి బయటకు వస్తాయని భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ తప్పు చేయనివారు అయితే నిర్భయంగా కేసులను ఎదుర్కోవాలని ఇతవు పలికారు. నార్కో టెస్ట్ చేస్తే మొత్తం బండారం బయటపడుతుందని అన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన కుటుంబ పార్టీ టిఆర్ఎస్ అన్నారు. కేవలం రాజకీయంగానే కాకుండా నిరుద్యోగులను ఉద్యోగులను యువతను కుల సంఘాలను అన్ని వర్గాలను ఎంతో మోసం చేశారని అన్నారు. గతంలో అన్నింటికీ తానే బాధ్యత అని చెప్పి ఇప్పుడు అధికారుల మీద అరుద్దడం ఇంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.తప్పు చేసేది వారి కుటుంబం అయితే కేసులు వచ్చేసరికి అధికారుల మీద రుద్దడం అలవాటుగా మారుతుందని వారికి అన్నారు. తెలంగాణ సంపద మొత్తం దోచుకొని విదేశాలకు తరలించి ఆర్థిక వనరులు అన్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆ పాపమే నేడు కేసుల రూపంలో వస్తుందని నిజ నిజాలు తొందర్లోనే బయటపడతాయని పేర్కొన్నారు.