ఐఎంఏ కామారెడ్డి వార్షిక క్రీడా పోటీలు
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 15:
ఐఎంఏ కామారెడ్డి వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా ఆదివారం కామారెడ్డి బ్యాడ్మింటన్ అకాడమీలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డా.ద్వారకనాథ్ రెడ్డి, గౌరవ అతిధి గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథ్ లు పాల్గొన్నారు. ఈ పోటీలో కామారెడ్డి మెడికల్ అసోసియేషన్ వైద్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర క్రీడలు నిర్వహించడం, సాంస్కృతిక కమిటీని ఏర్పాటు చేయడం, దాని కోసం ఐఎంఏ కామారెడ్డికి చెందిన డాక్టర్ ఈ.అరవింద్ కుమార్ సాంస్కృతిక క్రీడల రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన పురుషుల సింగిల్స్ విభాగంలో మొదటి స్థానం డాక్టర్ కమల్, రెండవ స్థానం డాక్టర్ శ్రవణులు గెలుపొందగా వారికిరాష్ట్ర అధ్యక్షుడు ద్వారకానాథ్ రెడ్డి , రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేంద్రనాథ్ ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాధ , కోశాధికారి డాక్టర్ పవన్, సీనియర్ వైద్యులు ఇ.వి. గౌడ్, డాక్టర్ రమణ, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ దినేష్, డాక్టర్ వెంకట్ లు పాల్గొని ముఖ్య అతిథులను సత్కరించారు.