తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం (టిఆర్పిఎస్) రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా ధనుంజయ్

తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం (టిఆర్పిఎస్) రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా ధనుంజయ్

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 19 : తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం (టిఆర్పిఎస్) రాష్ట్ర కార్యదర్శిగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన జిల్లా ధనుంజయ్ ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం (టిఆర్పిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావు గురువారం నియమాక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పద్మశాలీ సంఘం అభ్యున్నతికి, సమాజహిత కార్యక్రమాలు చేస్తున్న కృషిని గుర్తించి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించినట్లు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాల సంఘం రాష్ట్ర కార్యదర్శి జిల్లా ధనుంజయ్ మాట్లాడుతూ పద్మశాలీల సంక్షేమానికి, అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన పద్మశాలీ సంఘం నాయకులు రుద్ర శ్రీనివాస్, బోగ వెంకటేశ్వర్లుతో పాటు రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ధనుంజయ్ నియామకం పట్ల పద్మశాలీ సంఘం పట్టణ అధ్యక్షుడు గుంటుక ప్రసాద్, వృద్ధుల సంఘం నాయకులు ఎక్కలదేవి గంగాధర్, సిరిపురం గంగాధర్, వంగరి రామకృష్ణ తదితరులు హార్షం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment