ఐ ఎన్ టి ఎస్ ఓ లెవెల్ -1 ఫలితాలలో శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ విద్యార్థుల ప్రభంజనం

ఐ ఎన్ టి ఎస్ ఓ లెవెల్ -1 ఫలితాలలో శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ విద్యార్థుల ప్రభంజనం

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్

చివ్వెంల మండలం ఉండ్రుగొండలో గల శ్రీ స్వామి నారాయణ గురుకుల్ స్కూల్ విద్యార్థులు ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్ పరీక్షల్లో 478 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. ఇందులో 3 వతరగతి నుండి 50 మంది విద్యార్థులు నాలుగవ తరగతి నుండి 92 మంది విద్యార్థులు , ఐదవ తరగతి నుండి 91 మంది విద్యార్థులు, ఆరవ తరగతి నుండి 72 మంది విద్యార్థులు, ఏడవ తరగతి నుండి 53 మంది విద్యార్థులు, ఎనిమిదవ తరగతి నుండి 50 మంది విద్యార్థులు, తొమ్మిదవ తరగతి నుండి 70 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. ఇందులో సబ్జెక్టుల వారీగా ఎం టి ఎస్ ఓ లో 147 మంది జి టి ఎస్ ఓ లో 147మంది ఎస్ టి ఎస్ ఓ లో 106 మంది , ఈటిఎస్ 74 మంది , ఏ టి ఎస్ లో 04 ఎంపిక కావడం జరిగింది. మొత్తం గా 478 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు.
ఎంపికైన విద్యార్థులoదరినీ పూజ్య మంత్ర స్వరూప్ దాస్ జి స్వామీజీ , పాఠశాల డైరెక్టర్ హార్దిక్ సార్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆనంద్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. ఎవరికి సాధ్యం కాని విధంగా స్థాపించిన మూడు సంవత్సరాల లోనే ఇంతటి అద్భుత ఫలితాలను సాధిస్తున్న శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యమును విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment