*సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు*
తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి డిసెంబర్ 21 :
మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ లో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైనా, ఐదు లక్షల రూపాయల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు కర్రావుల సందీప్, గ్రామ శాఖ అధ్యక్షులు కనగండ్ల చంద్రయ్య, గాజ శ్రీనివాస్, మాచం శంకర్, కళ్లెం పోచయ్య, ఎరువ సుధాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేష్ , శ్రీహరి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.