ప్రతి వ్యక్తి ధ్యానాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి:చినుకని యువరాజు
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 21)
ధ్యానం అన్ని సమస్యలకు, సమగ్ర ఆరోగ్యానికి పరిష్కారం అని ప్రతి వ్యక్తి ధ్యానాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని యోగా సాధకులు చినుకని యువరాజు అన్నారు.
చౌటుప్పల్ మండలంలోని పంతంగి గ్రామ జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యోగా సాధకులు చినుకని యువరాజు హాజరై మాట్లాడుతూ… “వసుదైక కుటుంబకం” అనే సూత్రాన్ని బలంగా విశ్వసించేది భారత్ అని అన్నారు.ధ్యానం ద్వారా మానసిక స్పష్టత,ఒత్తిడి తగ్గింపు,ఎమోషనల్ బ్యాలెన్స్, శాంతి శ్రేయస్సు ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుందని తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, మెరుగుపరచడంలో ధ్యానం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా గుర్తించడం పట్ల ధ్యానం యొక్క సామర్ధ్యాన్ని గురించి ప్రభావితం చేసే విధంగా ఉంటుంది అని డిసెంబర్ 21వ తేదీన ధ్యాన దినోత్సవం గా ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేశారు.అనంతరం విద్యార్థులచే,ఉపాధ్యాయులచే ధ్యానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ,జిల్లా పరిషత్ పాఠశాలల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.