ప్రజావీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ కు ఘన నివాళులు* 

*ప్రజావీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ కు ఘన నివాళులు*

–ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షులు అక్కరవేణి పోచయ్య ముదిరాజ్

 

తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి డిసెంబర్ 10:

 

పేద, బహుజన వర్గాల ఆశాజ్యోతి పండుగ సాయన్న జీవిత చరిత్రను ఇప్పటి తరానికి తెలియజేసేలా, పాఠ్యంశాలలో ప్రచురించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అక్కరవేణి పోచయ్య ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. ప్రజావీరుడు, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, పాలమూరు ముద్దుబిడ్డ పండుగ సాయన్న ముదిరాజ్ 134వ వర్ధంతిని పురస్కరించుకొని, బెజ్జంకి మండల కేంద్రంలో పోచయ్య ముదిరాజ్ మాట్లాడుతూ, 18వ శతాబ్దంలో ప్రజల పక్షాన, పేద, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా నాటి తెలంగాణ దొరలకు వ్యతిరేకంగా, పేద బడుగు బలహీన వర్గాలు కష్టించి దాచుకున్న సొమ్ము, ధాన్యం ఎత్తుకెళ్లిన రజాకారులను ఎదిరించి, ప్రజల సొమ్మును గుంజుకొచ్చి తిరిగి ప్రజలకు పంచిన ప్రజా వీరుడుగా నిలిచాడని పండుగ సాయన్న ముదిరాజ్ ముద్దుబిడ్డ బహుజన బంధు, తెలంగాణ రాబిన్ హుడ్ గా చరిత్రలోకి ఎక్కాడని అంత గొప్ప వీరుని చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ తరాలకు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. పండుగ సాయన్న ఆశయ సాధనలో ముదిరాజులు, బిసి బడుగు బలహీన వర్గాలు ఐక్యతగా ముందుకు సాగాలని పిలుపునిస్తూ, ఘన నివాళులు అర్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment