దూల్మిట్ట మండల యూత్ కాంగ్రెస్

దూల్మిట్ట మండల యూత్ కాంగ్రెస్

అధ్యక్షుడిగా దరావత్ సుమన్ నాయక్ ఎన్నిక.

 

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి డిసెంబర్(6)

 

దూల్మిట్ట మండల యూత్ కాంగ్రెస్

అధ్యక్షుడిగా దరావత్ సుమన్ నాయక్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం రోజన ఆయన మాట్లాడుతూ మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.ముఖ్యంగా స్థానికంగా ఉన్న యువతను సుమన్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు, వారిని చైతన్య పరుస్తానని అన్నారు.ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నింటినీ ప్రజలకు చేరువ అయ్యేవిధంగా కృషి చేయడమే కాకుండా, నిజమైన లబ్ధిదారులఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు. ఇప్పటి వరకుతాను పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనను యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా ఎన్నిక చేసిన పార్టీ అధిష్టానానికి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మరియు మండలం అధ్యక్షులు కోలా సాయిలు గౌడ్ కి మండలనాయకులకు రుణపడి ఉంటానని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment