డ్రగ్స్ తో తాత్కాలిక ఆనందం కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దు
-గంజాయి రహిత జిల్లాగా ప్రతి ఒక్కరూ సహకరించాలి
-మర్కుక్ మండల ఎస్సై ఓ.దామోదర్
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 14,
సిద్దిపేట జిల్లా మర్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కర్కపట్ల ఇండస్ట్రియల్ ఏరియా నందు సిద్దిపేట జిల్లా డాగ్ స్క్వాడ్,పోలీస్ వారితో కలిసి డ్రగ్స్ గంజాయి వంటి మాదక ద్రవ్యాలు తీసుకోకుండా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో శనివారం రోజు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మర్కుక్ ఎస్ఐ ఓ.దామోదర్ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం మర్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్కపట్ల పారిశ్రామిక వాడలో,ఇతర అనుమానాస్పద ప్రదేశాలలో డ్రగ్స్,ఇతర మత్తు పదార్థాల గురించి నార్కోటిక్ డాగ్స్ తో తనిఖీలు నిర్వహించారు.గంజాయి ఇతర మత్తుపదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు పిల్లలను ఒక కంటితో కనిపెడుతూ ఉండాలని అన్నారు.గంజాయి ఇతర మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్స్ ఎవరైనా కలిగి ఉన్నా,లేక అక్రమంగా రవాణా చేసిన పాన్ షాపులలో కానీ,ఇతర షాపులలో అమ్మిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.గంజాయి ఇతర మత్తుపదార్థాలు ఎవరైనా కలిగి ఉంటే అమ్మిన,విక్రయించిన వెంటనే డయల్ 100 లేదా మర్కుక్ మండల పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డాగ్స్ స్క్వాడ్ హ్యాండ్లర్ కానిస్టేబుళ్లు అజయ్,కరుణాకర్,వర్క్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.