విశ్వహిందూ పరిషత్ తొలితరం నాయకులు వెల్దుర్తి రంగయ్య కన్నుమూత.
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి,డిసెంబర్ 18;
భువనగిరిలో విశ్వహిందూ పరిషత్ తొలితరం నాయకులు శ్రీ వెల్దుర్తి రంగయ్య శివైకం చెందడం హిందూ సమాజానికి తీరని లోటు వారు శ్రీరామ భక్త భజన మండలి స్థాపనలో వివిధ ధార్మిక కార్యక్రమాల ప్రారంభంలో అలాగే రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు హిందూ సమాజంలో ధార్మికతను పెంచి సమాజంలో ఐక్యత ద్వారా సేవా కార్యక్రమాలు చేసేవారు చాలా అరుదుగా కనిపిస్తారు అలాంటి వారిలో శ్రీ రంగయ్య ఒకరు వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం వారి ఆదర్శ జీవితం ఇప్పటి తరానికి మార్గదర్శనం చేయాలని ఆశిస్తున్నాం అని కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి అన్నారు.