---Advertisement---

అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి

---Advertisement---

అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి

తెలంగాణ కెరటం, డిసెంబర్ 26, మందమర్రి

కాసిపేట మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో గల పెద్దన్న పల్లి గ్రామం పదో వార్డులో గురువారం తెల్లవారుజామున కాటనర్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం కాటన్ సెర్చ్ నిర్వహించినట్లు మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పెద్దన్నపల్లి గ్రామంలో కాటన్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటినీ పోలీసులు తనిఖీలు నిర్వహించి. శాంతి భద్రతల పరిరక్షణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. శాంతి భద్రతల కోసం రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డిసిపి ఆదేశాల మేరకు కాటన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే ప్రజలు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు కారాదని ఎవరైనా వ్యక్తులు గంజాయి నీ వినియోగించిన చట్టపరమైన చర్యలు ఉంటాయని గంజాయిని విక్రయించేవారు పైన సమాచారం మాకు తెలియజేసిన వారి వివరాలు జాప్యంగా ఉంచుతామని అలాగే సైబన్ నేరగాల ఉచ్చులో పడవద్దని ఏదైనా సమస్య ఉంటే 100కు డయల్ చేయాలని సూచించారు. కాటన్ సెర్చ్ లో40 ద్విచక్ర వాహనాలను1 ఆటోను సీజ్ చేసినట్లు సరైన పత్రాలు అందజేసి వాహనాలు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసిపేట ఎస్సై ప్రవీణ్, దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు, అలాగే మందమర్రి అడిషనల్ ఎస్సై శ్రీనివాస్. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment