మెపా నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఈర్ల సాయిబాబు ముదిరాజ్ ఎన్నిక
నియామక పత్రం అందజేసిన రాష్ట్ర కమిటీ.
తెలంగాణ కెరటం భీంగల్ ప్రతినిధి డిసెంబర్ 29:
ఇటీవల హైదరాబాద్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో బడా బీంగల్ మండలం, గ్రామానికి చెందిన ఈర్ల సాయి బాబు ముదిరాజ్ ను నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా మెపా MEPA ( ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ & రాష్ట్ర కార్యవర్గం చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు.అనంతరం మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ..నిజామాబాద్ జిల్లా లో ముదిరాజ్ ల అభివృద్ది కోసం, రిజర్వేషన్ సాధన కోసం కృషి చేయాలని అన్నారు.అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా ఉపాధ్యక్షులు సాయి బాబు మాట్లాడుతూ ఈ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ కి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ గార్లకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో అన్ని మండల గ్రామస్థాయిలో మెపాను బలవపేతం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సభ్యులు దండు చిరంజీవి, సింగారపు రామకృష్ణ, సిద్ధ మధు, విజయ్, దాసరి వీరన్న, చిరుత వెంకటేశ్వర్లు, పొన్నం రాజు, శీలం జ్యోతి లతో పాటు జిల్లా నాయకులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.