నేటి తరానికి స్ఫూర్తిదాయకం
సావిత్రిబాయి పూలే.
ఘనంగా సావిత్రి బాయి పూలే 194 వ జన్మ దిన వేడుకలు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండనాగుల గ్రామంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే నేటి మహిళలకు యువతకుస్ఫూర్తిదాయకమని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సైదులు అన్నారు.ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశానికి వారు హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించినారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళా హక్కులే మానవ హక్కులు అని, తొలిసారిగా నినదించిన సావిత్రి బాయ్ పూలే జనవరి 03, 1831 న మహారాష్ట్ర లోని సత్తరా జిల్లా నాయగావ్ లో జన్మించారు,తొమ్మి దవ ఏట ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతి రావు పూలే ను వివాహమాడి ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతు రాలు అయ్యి 174 సంవత్సరాల క్రితమే “విద్య లేనిదే విజ్ఞానంలేదని” సామాజిక అభివృద్ధిలో విద్య యొక్క ప్రాముఖ్యతను ఒక అంశంగా తీసుకొని అహ్మద్ నగర్ లో1848 లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 17 సంవత్సరాల వయసులోనే ఈ దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మారి దేశంలో మొట్టమొదటిసారి అస్పృశ్యులకు విద్యాబోధన గావించి తాము స్వంతంగా నెలకొల్పిన పాఠశాలలో బాలికలకు విద్య నేర్పించే భాద్యతలు చేపట్టి 4 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాలలో 20 పాఠశాలలు స్థాపించి సొంత ఖర్చులతో ఉచిత విద్య,ఉచిత మధ్యాహాన్న భోజనం అందజేస్తూ కొద్ది కాలం లోనే 52 వేరు వేరు ప్రాంతాల్లో బడులను స్థాపించి ఆనాటి సామాజిక పరిస్థితుల రీత్యా అనేక ఇబ్బందులు ఎదురుకుంటు మహోన్నతమైన మహిళల విద్యా ఉద్యమాన్ని సాహసోపేతంగా చేపట్టారు, అదేవిధంగా”మహిళా హక్కులే-మానవ హక్కులు” అనే నినాదం తో మహిళలను చైతన్య పరుస్తూ “మహిళా సేవామండల్”స్థాపించి,సత్యశోదక్ సమాజం ద్వారా బాల్యవివాహాలకు,మద్యపానానికి,మూఢనమ్మకాలకు,సతీసహగమనం కు వ్యతిరేఖంగా బలమయిన ఉద్యమాన్ని నడిపిన మహోన్నత స్త్రీ మూర్తి,అంతేకాక ఆనాటి కాలంలో సంభవించిన దుర్భిక్ష పరిస్థితిని,ప్లేగ్ వంటి మహమ్మారిని ఎదుర్కొనే సమయం లో ప్రజలకు తోడ్పడి 10 మార్చ్ 1897 న ప్లేగ్ వ్యాధి సోకి మరణించడం జరిగినది, స్త్రీ విద్య కోసం ఆమె చేసిన పోరాటాన్ని భారత స్త్రీ జాతి భూమ్యాకాశాలు ఉన్నంతవరకు గుర్తుంచుకుంటుంది అని, భారత ప్రభుత్వం వారి జ్ఞాపకార్థం 1997లో తపాలా బిళ్ళను వెలువరించడం తెలంగాణ ప్రభుత్వం వారి జయంతిని “మహిళా ఉపాధ్యాయ దినోత్సవం”గా గుర్తించి నిర్వహించడం సంతోషకరం అన్నారు. అనంతరం కళాశాల పనిచేస్తున్న మహిళ ఉపాధ్యాయలకు శాలువాలతో సన్మానించడం జరిగిందిmఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ అధ్యాపకులు శేఖర్, శోభారాణి, శైలజ, అనిత, సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు, లైబ్రేరియన్ సయ్యద్, అధ్యాపకులు భార్గవి, శ్రీను, మల్లేష్, కృష్ణ, సత్యం, రమేష్ విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.