బిజెపి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని దేశ బహిష్కరణ చేయాలి.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 19):
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాల మేరకు టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం హోంశాఖ మంత్రివర్యులు అమిత్షా చేసిన వ్యాఖ్యల నిరసిస్తూ గురువారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ పదేపదే తాళిసే బదులు భగవంతుని కలిస్తే ఏడు జన్మలు సుకుతమవుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని దేవుని తలవద్దని మేము ఎక్కడ అనడం లేదు కానీ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఎందుకు తలవాలి అని చెప్పడం దుర్మార్గమైన చర్య అని బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అనకుండా ఉండుంటే బాగుండేదని కానీ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ని కించపరిచి బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుండా చేయాలని రాజ్యాంగం లేకుండా చేయాలి అని రాజ్యాంగాన్ని విలువలు లేకుండా చేస్తున్న బిజెపి ప్రభుత్వం గురువారం హోమ్ మినిస్టర్ అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని లేదా దేశ ప్రజలకు దేశరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్పకపోతే ఖచ్చితంగా క్షమాపణ చెప్పేంతవరకు దేశ బహిష్కరణ చేసెంత వరకు కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చిన గాని అచ్చంపేట పట్టణంలో ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు ఉంటది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ప మండల పార్టీ అధ్యక్షులు విజయ డైరీ చైర్మన్ నరసయ్య యాదవ్, మాజీ ఎంపీపీ రామనాథం, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘురాం, ఐ ఎన్ టి సి తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, కౌన్సిలర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్ బాలరాజు, కౌన్సిలర్ రాఘవులు, ఎన్ ఎస్ ఏ జిల్లా అధ్యక్షులు సంతోష్ నాయక్, సేవాదళ్ తాలూకా అధ్యక్షులు అంజి, ఐ ఎన్ టి సి తాలూకా ప్రధాన కార్యదర్శి అంజి, బాలకృష్ణ,వెంకటేష్, టౌన్ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు ఇసాక్ సాదిక్ కాజా, ఖదీర్, విష్ణు,యూత్ కాంగ్రెస్ దశరథం, తదితరులు పాల్గొన్నారు.