జిల్లాలో సుదీర్ఘంగా పనిచేయడం సంతృప్తినిచ్చింది – బదిలీపై వెళ్తున్న డీఈవో గోవిందరాజులు

నాగర్ కర్నూల్ జిల్లా ఆప్యాయతలు. అనురాగాలుకు నిలువైన నిలువుటద్దం.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 28):

సుదీర్ఘకాలంగా నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లాలో పనిచేయడం ఎంతో తనకి ఎంతో సంతృప్తినిచ్చిందని బదిలీపై వెళ్తున్న డిఇఓ గోవిందరాజులు అన్నారు. ఇటీవల నాగర్ కర్నూల్ డిఇఓ ను ప్రభుత్వం నారాయణపేట జిల్లాకు డీఈవోగా బదిలీ చేసిన విషయం తెలిసిందే.
గురువారం నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి బాధ్యతల నుండి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ను కలిసి రిలీవ్ అయ్యారు.
కార్యాలయ సిబ్బంది డిఈఓ కార్యాలయంలో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్యాలయ సిబ్బంది శాలువాలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ
సమాజంలో ప్రతి వ్యక్తికి మెరుగైన విద్య అందినప్పుడే అభివృద్ధిసాధ్యమవుతుందన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యా పరిరక్షణ కోసం తనతోపాటు కృషి చేసిన జిల్లా ఉపాధ్యాయలోకానికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ పని చేసే అవకాశం రావడం, సమర్థవంతంగా, సుదీర్ఘ కాలంగా డిఇఓ గా పని చేసిన మధురస్మృతులతో బదిలీపై వెళ్లడం ఆనందంగా ఉందన్నారు.ఉపాధ్యాయులకుకార్యాలయ సిబ్బంది రానున్న రోజుల్లో జిల్లా ఉపాధ్యాయులకు మరింత ఉత్తమ సేవలందించాలని ఆకాంక్షించారు.జిల్లా పరిధిలో పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్ర, ఉమ్మడి జిల్లాలో అత్యుత్తమ స్థానాలు సాధించడం, పలు ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు రూపొందించిన సైన్స్ కార్యక్రమాలతో జాతీయస్థాయిలో గుర్తింపు తేవడం, బదిలీలు, పదోన్నతులు, డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా చేపట్టడం లాంటి ఎనో కార్యక్రమాలు తనకి ఎంతగానోసంతృప్తినిచ్చాయన్నారు.జిల్లా మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తనపై ఎంతో ఆప్యాయత కనబరిచారన్నారు.
విధుల్లో సిబ్బంది ఎంతగానో సహకరించారన్నారు.
జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు విద్యార్థులకు డిఇఓ కృతజ్ఞతలు తెలిపారు.
తాను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజీవ్ విద్యా మిషన్ అధికారిగా, ఉమ్మడి జిల్లా డీఈవోగా, వివిధ శాఖల్లో పనిచేసిన కాలంలో కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా, వివాదాలకు ఆస్కారం లేకుండా పనిచేయడం జరిగిందని ఆయన అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో దాదాపు 6 సంవత్సరాల కాలం పాటు జిల్లాలో ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణమని, కానీ నాగర్ కర్నూల్ జిల్లా ఆప్యాయతలు, అభిమానానికి నిలువుటాద్దాం లాంటిదని, ప్రజలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తనపై చూపిన అభిమానానికి జిల్లా నుండి బదిలీపై వెళ్తున్నందుకు కొంత మేరకు వ్యక్తిగతంగా తనకు బాధగా మాత్రమే ఉందన్నారు.
ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు సిబ్బంది వివిధ సంఘాల నాయకులు పలువురు మాట్లాడుతూ…
సుదీర్ఘకాలం పాటు నాగర్ కర్నూల్ జిల్లా విద్యా అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో కీలక పాత్ర పోషించారని, జిల్లాలో నిర్వహించిన బదిలీలు, పదోన్నతుల్లో ఎక్కడ ఎలాంటి తారతమ్యం భేదం లేకుండా నిర్వహించారని, మిగిలిన రెండు సంవత్సరాల ఉద్యోగ కాలం కూడా జిల్లాలో పనిచేసే రిటైర్డ్ అవుతారనే ఆశతో ఉన్నామని, వివిధ సంఘాల నాయకులు అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాను విద్యాపరంగా అత్యున్నత స్థానంలో నిలిచేలా కృషి చేశారని మాట్లాడిన వక్తలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గణాంక అధికారి మధుసూదన్ రెడ్డి, ఏసీ రాజశేఖర్ రావు, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్, సుజాత, సెక్టోరియల్ అధికారులు వెంకటయ్య, షర్ఫుద్దీన్, నూరుద్దీన్, మురళీధర్ రెడ్డి, శోభారాణి, ఎస్ జి ఎఫ్ కార్యదర్శి పాండు, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ రావు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు రామచంద్రరావు, విజయ్ కుమార్, రాజిరెడ్డి, మురళి, సురేందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, నిరంజన్, మండల విద్యాధికారులు భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దానయ్య, రాజేష్, ఆంజనేయులు, వెంకటయ్య, సురేందర్ రెడ్డి, ప్రైవేట్ స్కూల్స్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కార్యాలయ అధికారులు సిబ్బంది శివ రత్నమ్మ, తిరుపతమ్మ, విష్ణు, వెంకటేశ్వర్లు శెట్టి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment