*క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి*
తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 25.
క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలంలోని సి ఎస్ ఐ చర్చిలో క్రైస్తవ సోదరులు నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనీ క్రైస్తవ సోదర సోదరి మణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతు
క్రైస్తవ సోదర సోదరి మణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నమని,రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని, ఈ రోజు అధికారికంగా ఒక ఎమ్మెల్యే విప్ హోదాలో క్రైస్తవ సోదర సోదరిమణుల మధ్య క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆ క్రీస్తుని కృప కటాక్షాలు ఎల్లవేళలా ధర్మపురి నియోజక వర్గ ప్రజలపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర రాములు గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు క్రైస్తవ సోదరులు సోదరిమణు లు చర్చి ఫాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు.